హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో డీసీపీ వారిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వారిలో ఒకరికి గాయాలు కాగా నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. ఓ ఇద్దరు సెల్‌ఫోన్ దొంగలు డీసీపీ చైతన్య కుమార్‌పై కత్తితో దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే దాడిని అడ్డుకునేందుకు డీసీపీ గన్‌మెన్ యత్నించారు. దీంతో తోపులాట జరిగి గన్‌మెన్ కింద పడిపోయాడు.
దొంగలు మళ్లీ దాడి చేసేందుకు యత్నించగా.. గన్‌మెన్ వద్ద ఉన్న వెపన్‌ను తీసుకుని డీసీపీ చైతన్య దొంగలపై 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే.