బ్యూటీపార్లర్ యజమాని అత్యాచారయత్నం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ సెలూన్ షాపు యజమాని వేధింపులతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 31 Jan 2024 11:50 AM ISTబ్యూటీపార్లర్ యజమాని అత్యాచారయత్నం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్‌లో యజమాని వేధింపులతో యువతి ఆత్మహత్య చేసుకుంది.సెలూన్ లో పనిచేస్తున్న యువతిపై యాజమాని అత్యాచారయత్నాన్ని పాల్పడ్డాడు. యజమాని తీరుతో అవమాన భారం భరించలేక సెలూన్ లోని శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు వయస్సు 18 ఏళ్లు. ఆమె స్వస్థలం నల్లగొండ జిల్లా. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. మీర్‌పేట్‌లో ఉన్న సెలూన్‌లో పని చేస్తోంది.
18 ఏళ్ల యువతి తాను పనిచేస్తున్న బ్యూటీపార్లర్‌ర్ యజమాని.. తనపై అత్యాచారానికి యత్నించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు గత ఆరు నెలలుగా బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మురళి అనే బ్యూటీ పార్లర్ యజమాని బాధితురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలి నుంచి ప్రతిఘటన వచ్చింది.
అయితే ఆ అవమానాన్ని తట్టుకోలేక శానిటైజర్ తాగి జీవితాన్ని ముగించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే, బ్యూటీపార్లర్ యజమాని బాధితురాలి తల్లిని పిలిపించారు. ఇద్దరూ ఆమెను నక్షత్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేసి, ఆమె క్షేమంగా ఉండడంతో ఇంటికి పంపించారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో, బాధితురాలు మళ్లీ అనారోగ్యం బారిన పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యూటీపార్లర్ ఎదుట ఆందోళనకు దిగారు.మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్‌లో యజమాని వేధింపులతో యువతి ఆత్మహత్య చేసుకుంది.