హైదరాబాద్ లో వారికోసం జల్లెడ పడుతున్న అధికారులు

వివిధ వీసాలతో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు.

By Medi Samrat
Published on : 25 April 2025 2:30 PM IST

హైదరాబాద్ లో వారికోసం జల్లెడ పడుతున్న అధికారులు

వివిధ వీసాలతో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి ఆదేశాలు అందిన తర్వాత ఈ డ్రైవ్ ప్రారంభమైంది. అధికారిక రికార్డుల ప్రకారం, ప్రస్తుతం నగరంలో 208 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నారు. వారిలో 156 మంది దీర్ఘకాలిక వీసాలు కలిగి ఉన్నారు, 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. 39 మంది వైద్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం హైదరాబాద్ లో ఉన్నారు. అయితే, నగరంలోని మూడు కమిషనరేట్లలో చెల్లుబాటు అయ్యే SAARC వీసాలు కలిగిన పాకిస్తానీ జాతీయులు ఎవరూ లేరు.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రహోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం పాకిస్తానీయులను వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టారు.

Next Story