11 నిమిషాల్లో రూ.18 లక్షలు మోస‌పోకుండా కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని పార్శిల్ పేరుతో మోసపోకుండా అడ్డుకున్నారు.

By Medi Samrat  Published on  28 Jun 2024 1:39 PM GMT
11 నిమిషాల్లో రూ.18 లక్షలు మోస‌పోకుండా కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని పార్శిల్ పేరుతో మోసపోకుండా అడ్డుకున్నారు. రూ.18 లక్షల మోసపోకుండా కాపాడారు. అంబర్‌పేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు కొరియర్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్‌గా నటించి సైబర్ మోసగాడు రూ.18 లక్షలు కాజేయాలని అనుకున్నాడు. అయితే పోలీసులు వేగంగా స్పందించి మోసానికి చెక్ పెట్టారు.

డిసిపి (సైబర్ క్రైమ్స్) డి.కవిత మాట్లాడుతూ ముంబై నుండి ఇరాన్‌కు అక్రమ డ్రగ్స్‌ను రవాణా చేయడానికి మీ ఆధార్ ఆధారాలను ఉపయోగించారని బెదిరించారు. స్కైప్ ద్వారా ముంబై సైబర్ క్రైమ్‌ బ్రాంచ్ ను సంప్రదించమని కోరారు. టెకీని ఏకంగా 18 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుని, ఆపై వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయమని చెప్పారు. వాళ్లు బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నారు. తాను మోసపోయానని గ్రహించిన టెకీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎన్‌సిఆర్‌పి పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదును నమోదు చేసి, బాధితుడి బ్యాంకుకు, అనుమానిత బ్యాంకుకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి సైబర్ మోసగాళ్లతో సంబంధం ఉన్న ఖాతాలోని మొత్తం రూ.18 లక్షల లావాదేవీని బ్లాక్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కేవలం 11 నిమిషాల వ్యవధిలో జరిగిందని కవిత తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన పార్సిల్స్ మీపేరు మీద వచ్చాయి.. మేము అధికారులు అంటూ బెదిరిస్తే ఎవరూ కూడా డబ్బులు వేయకండని సూచించారు పోలీసులు.

Next Story