ముగిసిన సూపర్ స్టార్ అంత్యక్రియలు

Super Star Krishna last rites. సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం అశేష అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ

By Medi Samrat  Published on  16 Nov 2022 11:02 AM GMT
ముగిసిన సూపర్ స్టార్ అంత్యక్రియలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం అశేష అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోస్‌ నుంచి ఫిల్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. పోలీసుల అధికారిక వందనంలో కృష్ణను వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన శోభయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు పొటెత్తారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు జనాలు పోటేత్తారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికార లాంఛనలతో సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు సాగిన ర్యాలీకి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ తారలంతా రోడ్డు మార్గాన నడుస్తూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకు ముందు పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్ధివ దేహం ఉంచగా.. సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు కడసారి నివాళి అర్పించారు.


Next Story
Share it