హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5:45 గంటలకు చీకటి మేఘాలు చుట్టుముట్టడంతో వాతావరణంలో ఆకస్మిక మార్పు ప్రారంభమైంది. ఆ తర్వాత తీవ్రమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నల్లకుంట తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రయాణికులు, నివాసితులు నివ్వెరపోయారు.
IMD హైదరాబాద్ ఇప్పటికే నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. తాజా వర్షంతో వాతావరణ ఔత్సాహికులు కనీసం మూడు గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. నగరంలోని ఆబిడ్స్, నాంపల్లి బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, చైతన్యపురి, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ అసుపత్రి, మెట్టుగూడా, పార్సిగుట్ట, మెట్టుగూడా, మలక్ పేట్, సైదాబాద్, మాదన్నపేట్, చాదర్ ఘాట్‌లలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
ఇదిలావుంటే.. ములుగు, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి తదితర తెలంగాణ జిల్లాల్లోని ఏకాంత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (30-40 కి.మీ.)తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.