హైద‌రాబాద్‌లో విద్యుత్ అంత‌రాయ‌మా..? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

Special Control room numbers in Hyderabad For Electricity disturbances.బుధ‌వారం తెల్ల‌వారుజామున గ్రేట‌ర్ హైద‌రాబాద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2022 7:37 AM GMT
హైద‌రాబాద్‌లో విద్యుత్ అంత‌రాయ‌మా..? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

బుధ‌వారం తెల్ల‌వారుజామున గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. భారీ వ‌ర్షం, ఈదురు గాలుల కార‌ణంగా ప‌లు చోట్ల విద్యుత్ స్తంభాల‌పై చెట్లు కూలాయి. దీంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. చెట్ల‌ను తొల‌గించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ ఉందన్నారు. మీరు ఉంటున్న ప్రాంతాల్లోని చెట్ల మీద‌, వాహ‌నాల మీద విద్యుత్ వైర్లు ప‌డితే.. వాటిని తాకే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని సూచించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీటిలో విద్యుత్ వైర్లు, ఇత‌ర విద్యుత్ ప‌రిక‌రాలు మునిగి ఉన్న‌ట్లైయితే అటు వైపుగా వెళ్లొద్ద‌న్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితులుంటే 1912 లేదా 100 లేదా స్థానిక ఫ్యూజ్ కాల్ ఆఫీస్ కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. వాటితో పాటు 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను ఫిర్యాదు చేయ‌వ‌చ్చున‌ని హైద‌రాబాద్ న‌గర వాసుల‌కు సూచించారు.

Next Story