ఎస్పీబీ విగ్రహ వివాదం.. శైలజ ఏమ‌న్నారంటే..?

By -  Medi Samrat
Published on : 15 Dec 2025 7:10 PM IST

ఎస్పీబీ విగ్రహ వివాదం.. శైలజ ఏమ‌న్నారంటే..?

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పెట్టడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే అక్కడ ఎస్పీబీ విగ్రహం వద్దని పలు ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. విగ్రహావిష్కరణ రోజు డిసెంబరు 15న కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వచ్చిన బాలు చెల్లి, గాయని ఎస్పీ శైలజ స్పందించారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నారు. ఇప్పుడు వాయిద్య బృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని శైలజ అన్నారు. అన్నయ్య విగ్రహ వివాదం గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.

Next Story