భారీ ఎత్తున గంజాయి పట్టివేత
SOT Police Seized Cannabis. కూకట్పల్లి పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 July 2023 9:04 PM ISTకూకట్పల్లి పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు ఒకవైపు పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కృషి చేస్తూ ఉంటే... మరో వైపు కొన్ని ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా వివిధ పద్ధతుల్లో గంజాయిని హైదరాబాదుకు తరలించి రహ స్యంగా పోలీసుల చేతికి చిక్కకుండా విక్రయాలు జరుపుతున్నారు.. విద్యార్థులను, వ్యాపారవేత్తలను, అవసరమైన వినియోగదారులను టార్గెట్గా చేసుకొని గంజాయి విక్రయాలు జరుగుతున్న ముఠాలపై ఎస్ఓటి పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కుకట్పల్లి వద్ద భారీ ఎత్తున గంజాయి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహమ్మద్ అఖిల్, షేక్ అల్లావుద్దీన్, విజయ్, వహీద్, అజిత్ వంశీ ఈ ఐదుగురు నిందితులు జలసాలకు అలవాటు పడ్డారు వీరు చేసే పనులకు వచ్చే డబ్బులు వారి జల్సాలకు సరిపోలేదు... దీంతో ఈ ఐదుగురు నిందితులు కలిసి సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అయితే హైదరాబాదులో గంజాయికి డిమాండ్ ఉన్నట్లుగా తెలుసుకున్నారు ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి హైదరాబాదులో ఎక్కువ ధరకు విక్రయాలు జరపాలని ప్లాన్ వేశారు.ఈ క్రమం లోనే ఈ ఐదుగురు నిందితులు ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మహమ్మద్ అఖిల్, షేక్ అల్లావుద్దీన్, విజయ్, వహీద్, అజిత్ వంశీ ఈ ఐదుగురు నింది తులు పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి మారేడుపల్లి నుండి జహీరాబాద్ కు తరలిస్తున్నారు.ఈ ముఠా సభ్యులు దర్జా గా ఇన్నోవా కార్లో గంజాయి పాకెట్లను పెట్టుకుని రోడ్డు మార్గాల బయలుదేరారు.
అదే సమయంలో కూకట్పల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఓటి పోలీసులకు ఇన్నోవా కారు అనుమానస్పదంగా కనిపించడంతో వెంటనే పోలీసులు కారు ను అడ్డుకున్నారు... పోలీసులు కారు మొత్తం తనిఖీ చేయగా... కారులో భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్దనుండి 50 లక్షల విలువచేసే 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటి బృందం అరెస్టు చేసిన వారిని మరియు స్వాధీనం చేసుకున్న వాటిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ నిందితులపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.
కారులో గంజాయిని మారెడుమిల్లి నుండి జహీరాబాద్ కు పెద్దమొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను మాదాపూర్ ఎస్ఓటి, కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. కిషన్ బాగ్ కు చెందిన యండి.అఖీల్ అనే వ్యక్తి మెదక్ జిల్లా కొహిర్ గ్రామంలో కోళ్ల ఫారంలో పని చేస్తుంటాడు. అతని ఆదాయం తన జలసాలకు సరిపోకపోవడంతోగంజాయి తరలించటం, విక్రయించడం చేస్తూ, గంజాయి విక్రయదారులకు మధ్యవర్తిత్వం చేస్తూ ఉండేవాడు. మియాపూర్ కు చెందిన షేక్ అలావుద్దీన్, హౌడేకర్ విజయ్, వహీద్, అజిత్ వంశీ వీరందరూ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వీరితో అఖిల్కు పరిచయం ఏర్పడింది. దీంతో ఈ ఐదుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పెద్దమొత్తంలో గంజాయి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో వంటల రఘురాం అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు 230 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం ఈ నిందితులు పోలీసుల చేతికి చిక్కకుండా రహస్యంగా ఓ కారులో వంశీ, విజయ్ లు ఇద్దరు ఎస్కార్ట్ వాహనం లాగా... వీరు మారేడుమిల్లి నుండి జహీరాబాద్ కు తరలిస్తుండగా, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే కూకట్‌పల్లి పోలీసులతో కలిసి కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద వాహనాలు తనకి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా కల్పించిన కారణం భారీ ఎత్తున గంజాయి కనిపించింది. ఈ ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 50 లక్షలు విలువచేసే 230 కేజీల గంజాయితో పాటు, తరలింపుకు ఉపయోగించిన రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.