మార్చి 14న అన్ని కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసివేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ప్రకటించింది. ఈ ఆదేశం హోలీ పండుగ సందర్భంగా అమలులోకి వచ్చాయి. GHMC పరిధిలోని అన్ని కబేళాలు, బీఫ్ మాంసం దుకాణాలకు వర్తిస్తుంది. ఈ ఆదేశాన్ని అమలు చేయడంలో కార్పొరేషన్ సిబ్బందికి సహాయం అందించాలని, అధికారులకు సూచనలు జారీ చేయాలని GHMC కమిషనర్ ఇలంబరితి పోలీసు కమిషనరేట్‌ను కోరారు.
మార్చి 13 అర్ధరాత్రి నుండి మార్చి 14 వరకు హైదరాబాద్‌లో హోలీ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో, ప్రజా భద్రతను నిర్ధారించడానికి, అల్లర్లను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు వీధుల్లో గుంపులుగా వాహనాల రాకపోకలపైన, రంగులు చల్లుకోవడంపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ జారీ చేసిన ఈ ఉత్తర్వు మార్చి 13 సాయంత్రం 6 గంటల నుండి మార్చి 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.