ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అన్ని పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం దుకాణాలు మూసివేయనున్నారు

By Medi Samrat  Published on  13 Aug 2024 3:45 PM GMT
ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అన్ని పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు మూసివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కార్పొరేషన్ సిబ్బందికి సహాయం చేయాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి కాటా పోలీసు కమిషనరేట్‌ను కోరారు. GHMC చట్టం, 1955లోని సెక్షన్ 533 (b) ప్రకారం.. "GHMC పరిధిలోని అన్ని పశువుల కబేళాలు, రిటైల్ బీఫ్ షాపులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మూసివేయబడతాయి" అని ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ‌లో పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అధికారికంగా గోల్కొండ కోట‌పై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయ‌నున్నారు.

Next Story