శేరిలింగంపల్లిలో బీజేపీకి ఊహించని షాక్

శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  18 Nov 2023 12:54 PM
శేరిలింగంపల్లిలో బీజేపీకి ఊహించని షాక్

శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. మొవ్వ సత్యనారాయణతో పాటు నియోజవర్గంలోని బీజేపీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు. బీజేపీలో సామాజిక న్యాయం జరగడం లేదని మొవ్వ సత్యనారాయణ ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 లక్షలకు పైగా కమ్మ సామాజికవర్గం ఉన్నప్పటికీ.. ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడంతో బాధ కలిగించిందన్నారు. తమతో కనీసం చర్చించకుండా పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నారు. పార్టీని బలపర్చడానికి చాలా మంది కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం బీజేపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. తన కార్యకర్తలు, నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మొవ్వ సత్యనారాయణ తెలిపారు.

ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ నుంచి ఆరెకపూడి గాంధీ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్​ మాదాపూర్ ​కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్​లీడర్​ వి.జగదీశ్వర్​గౌడ్​కొద్దిరోజుల కిందట కాంగ్రెస్​​లో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా రవికుమార్​ యాదవ్ బరిలో ఉన్నారు. ఆయనకు ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ అంటిముట్టనట్లు ఉంటున్నారు.

Next Story