కొత్త సంవత్సరాన్ని జరుపుకునే ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) నగరంలో జనవరి 1న ప్రత్యేక MMTS రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. ఏర్పాట్లను ధృవీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శ్రీధర్ మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెరిగిన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా.. నగరం అంతటా అర్థరాత్రి కనెక్టివిటీని సజావుగా ఉండేలా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.
లింగంపల్లి - హైదరాబాద్ (నాంపల్లి) స్పెషల్ రైలు జనవరి 1న తెల్లవారుజామున 1:15 గంటలకు లింగంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్ రైలు.. అత్యంత కీలకమైన చందానగర్ నుంచి లక్టీకాపుల్ రూట్లో వెళ్తుంది. మార్గమధ్యలో హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్, బేగంపేట్, ఖైరతాబాద్ స్టేషన్లలో ఆగుతూ.. జనవరి 1, తెల్లవారుజామున 1:55 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
అలాగే.. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్లే ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక ఎంఎంటీఎస్ రైలును కేటాయించారు. ఈ రైలు అదే రోజు తెల్లవారుజామున 1:30 గంటలకు లింగంపల్లి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.