సాయి సూర్య డెవలపర్స్ పై చీటింగ్ కేసు
Sai Surya developers owner booked failing deliver land green meadows venture. హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 July 2023 9:30 PM ISTహైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తపై 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇటీవల చీటింగ్ కేసు నమోదు చేశారు. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నక్కా విష్ణు వర్ధన్ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్‌లో మూడు కోట్ల రూపాయలకు పైగా (రూ. 3,21,34,000) పెట్టుబడి పెట్టారు. ఏప్రిల్ 2021లో షాద్‌నగర్‌లో 14 ఎకరాల భూమి మీద పెట్టుబడి పెట్టారు. ఈ వెంచర్‌లో డాక్టర్ సుధాకర్ రావు, శ్రీకాకుల్మ విటల్ మహేష్, రాజేష్, శ్రీనాథ్, కె హరీష్, కోట్ల శశాంక్, సిహెచ్ రవి కుమార్, కె ప్రభావతి, వెంకట్ రావు, కృష్ణ మోహన్ కూడా పెట్టుబడులు పెట్టారు.
NALA (వ్యవసాయేతర భూమి), తనఖా ప్లాట్‌ల కోసం ఒప్పందం జరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్లాట్‌లను రిజిస్టర్ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడి పెట్టారు. సమయం గడిచేకొద్దీ, కంపెనీ నుండి సరైన సమాచారం లేకపోవడం వల్ల పెట్టుబడిదారులకు అనుమానం పెరిగింది. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో విచారణ నిర్వహించగా, నక్కా విష్ణు వర్ధన్.. అతని సహచరులు ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నారు. వారి పెట్టుబడికి సంబంధించిన అన్ని మార్ట్‌గేజ్ ప్లాట్‌లు వారికి తెలియకుండా లేదా సమ్మతి లేకుండా SRV & TNR ఇన్‌ఫ్రా-రాజారామ్ & VASGI వెంకటేష్ అనే థర్డ్-పార్టీ ఫైనాన్షియర్‌లచేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వారిలో ఆందోళన మొదలైంది.
నక్కా విష్ణు వర్ధన్, ఇతరులు సాయి సూర్య డెవలపర్స్ గొప్ప సంస్థ కాబట్టి, ఎటువంటి మోసం జరగదు అని భావించారు. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు లాంటి వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడంతో కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నారు. అయితే, ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లిన చూడగా.. సంస్థ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నది జరగలేదని తేలింది. అభివృద్ధి జరగలేదని, అవసరమైన అనుమతులు ఆశించిన విధంగా పొందలేదని తేలింది. అదనంగా, ప్రాజెక్ట్ కు సంబంధించిన భూమి ఉన్న రైతులతో ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సతీష్ చంద్ర విఫలమయ్యారని తెలుసుకున్నారు బాధితులు.
న్యాయం చేయాలని కోరుతూ సతీష్ చంద్ర గుప్త 30 మంది పెట్టుబడిదారులు కలిసి.. సాయి సూర్య డెవలపర్‌లపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతూ నక్కా విష్ణు వర్ధన్ పై మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ కె ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 406, 420 కింద నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, మోసం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.