హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్

హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు.

By Medi Samrat  Published on  29 Jun 2024 11:00 AM
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్

హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు. మణికొండ ప్రాంతంలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను కనుగొన్నాడు. ఈ ఘటనపై కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జూన్ 29, శనివారం నాడు తనకు ఎదురైన అనుభవం గురించి తెలిపాడు. బిరియానీలో సేఫ్టీ పిన్‌ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశారు.

దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తన వాట్సాప్‌లో జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని కోరారు. “తక్కువ సమయంలో స్పందించినందుకు ధన్యవాదాలు. ఇతర కస్టమర్‌లకు ఈ విషయం జరగదని మేము ఆశిస్తున్నాము. దయచేసి నిర్దిష్ట రెస్టారెంట్‌పై అవసరమైన చర్యలు తీసుకోండి." అంటూ మరో పోస్టు పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హాస్టళ్లు, పీజీలపై అధికారులు ఓ వైపు సోదాలు నిర్వహిస్తూ ఉండగా.. మరో వైపు బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించిన ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story