మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
RTC bus hits Metro pillar in Malakpet.హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా
By తోట వంశీ కుమార్ Published on
13 April 2022 5:10 AM GMT

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన సిటీ ఆర్డినరీ బస్సు అదుపు తప్పి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. ఆటోను తప్పించబోయి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మలక్‌పేట్ మెయిన్ రోడ్డులో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించారు. బస్సును అక్కడి నుంచి తరలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story