సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారులు విస్తృత సోదాలు చేస్తూ ఉన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సికింద్రాబాద్ డివిజన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 4 ఘటనల్లో రూ.48.26 లక్షల విలువైన అక్రమ మద్యం, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పొగాకు, మద్యంపై ఆర్‌పిఎఫ్ అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ యాక్షన్ ను అధికారులు తీసుకున్నారు. ఈ దాడుల్లో భాగంగా ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/సికింద్రాబాద్, ఐఆర్‌పీ/ఎస్సీ, డివిజనల్, సీపీడీఎస్/సికింద్రాబాద్‌తో కూడిన సంయుక్త బృందం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సమయంలో మద్యం సీసాలు తీసుకువెళుతున్న ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.
ఆర్‌పిఎఫ్ బృందం 2 లగేజీ బ్యాగుల నుండి వివిధ బ్రాండ్‌ల 20 బాటిళ్లలో 15 లీటర్ల మద్యాన్ని విజయవంతంగా రికవరీ చేసింది. దీని విలువ రూ. 48,000.. బట్టలు, వస్తువుల మధ్య సాధారణ సామాను లాగా రహస్యంగా దాచాడని అధికారులు తెలిపారు. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్‌పిఎఫ్ సికింద్రాబాద్, దేబాష్మిత సి బెనర్జీ మాట్లాడుతూ, “దేశం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నందున, ఆపరేషన్ సత్రక్ లో భాగంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల పట్ల, ముఖ్యంగా రైల్వే నెట్‌వర్క్‌లో దాడులను ముమ్మరం చేశాం. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు అధికారులను సంప్రదించాలని" కోరారు. రిపోర్ట్ చేయాలని RPF ప్రజలను కోరింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని ఆర్‌పిఎఫ్ రైల్వేలో నిషిద్ధ వస్తువుల తరలింపుపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. గత సంవత్సరం 2023లో 27.7 కోట్ల విలువైన అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకుంది.