న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌పై దాడి చేసినందుకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆగస్టు 7న ఓ రౌడీ షీటర్ పై కేసు నమోదు చేశారు. మహమూదా హోటల్‌లో రాత్రి సమయంలో యూట్యూబర్ పై దాడి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సోహైల్, అతని సహచరులు యూట్యూబర్ ముబీన్ మీర్జాపై కత్తితో దాడి చేశారు. బాధితుడి ముఖానికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత, మీర్జాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH)కి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. "సోహైల్, అతని సహచరులు యూట్యూబర్ ముబీన్ మీర్జాపై దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం" అని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.
సోహైల్ గురించి మీర్జా తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను అప్లోడ్ చేశాడు. సోహైల్, అతని నేర కార్యకలాపాల గురించి ఉన్న వీడియోను తీసివేయాలని సోహైల్ డిమాండ్ చేశాడు. అందుకు మీర్జా నిరాకరించడంతో, సోహైల్ అతని సహచరులు అతనిపై దాడి చేసి, అతని ముఖంపై కత్తితో గాయపరిచారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సోహైల్‌తో పాటు అతని సహచరులపై కేసు నమోదు చేశారు.