డీజీపీకి రేవంత్ రెడ్డి రెండు ఫిర్యాదులు

Revanth Reddy Complaints to DGP Against Nagar Kurnool Incident. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ నాయకులు

By Medi Samrat  Published on  9 Jan 2023 12:22 PM GMT
డీజీపీకి రేవంత్ రెడ్డి రెండు ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ నాయకులు డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణ‌లు, దాడులకు దిగారని తెలిపారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారని.. దాడికి గురైన బాధితుల్లో ఒకరు గిరిజన, మరొకరు దళిత వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను.. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని అనుకున్నాం.. కానీ మా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టారని.. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేశామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

అలాగే.. 12 మంది పిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మరో ఫిర్యాదును కూడా ఇచ్చామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరిన‌ట్లు తెలిపారు. ఆధారాలతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డీజీపీని కోరిన‌ట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు. ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుందని అన్నారు.


Next Story