వ‌ర‌ద‌లు లేకున్నా.. ఉద్రిక్తంగా మారిన‌ మూసీ పరివాహక ప్రాంతం

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ కింద కూల్చివేత కోసం ఇళ్లను గుర్తించే ఆపరేషన్ కు మూసీ పరివాహక ప్రాంత నివాసితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు

By Medi Samrat  Published on  27 Sept 2024 6:09 PM IST
వ‌ర‌ద‌లు లేకున్నా.. ఉద్రిక్తంగా మారిన‌ మూసీ పరివాహక ప్రాంతం

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ కింద కూల్చివేత కోసం ఇళ్లను గుర్తించే ఆపరేషన్ కు మూసీ పరివాహక ప్రాంత నివాసితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్వేల కోసం రావడంతో, వారి కార్యకలాపాలను నివాసితులు అడ్డుకున్నారు. లంగర్ హౌస్‌లో, నిర్వాసితులైన నివాసితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. డిఫెన్స్ కాలనీకి చెందిన మరికొందరు రింగ్ రోడ్‌పై నిరసనలు చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

చైతన్యపురి, సత్యనగర్‌, మారుతీ నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తులో రెవెన్యూ అధికారులు సర్వేలు నిర్వహించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలించే ప్రసక్తే లేదని సర్వేలను అడ్డుకున్నారు. నా ఇళ్లను ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తాము మద్దతిచ్చామని, ఇప్పుడు పార్టీ తమకు ద్రోహం చేసిందని తమ నిరాశను వ్యక్తం చేశారు.

Next Story