క్లాసిక్ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్ మహిళ

న్యూఢిల్లీలో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త రత్న మెహెరా టైటిల్‌ను గెలుచుకున్నారు

By Medi Samrat  Published on  5 April 2024 1:15 PM GMT
క్లాసిక్ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్ మహిళ

న్యూఢిల్లీలో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త రత్న మెహెరా టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మమతా త్రివేది పాల్గొన్నారు.

పోటీలో అనేక ఇంటర్వ్యూలు, ఆడిషన్లు జరిగాయి. చివరి రౌండ్లో 30 మంది మహిళలు పోటీ పడ్డారు. వీటిలో టూరిజం, నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్, టాలెంట్ రౌండ్, రెట్రో రౌండ్, క్లాసికల్ డ్యాన్స్ రౌండ్ వంటి వివిధ విభాగాల్లో రత్న మంచి మార్కులు సాధించడంతో టైటిల్ నెగ్గడం సులువైంది. "ఈ పోటీలో నా విజయం అంత సులభం కాదు, నా భర్త రూపేష్ కుమార్ బలభద్ర, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైంది" అని రత్న చెప్పుకొచ్చారు.

రత్న పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఐఐఎం నుంచి కామర్స్‌లో పట్టభద్రుడై ఎంసీఏ చేశారు. ఆమె సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ టు అచీవ్ (SEWA), ఒక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు రత్న. ఆమెకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Next Story