కెప్టెన్‌ల‌కు సీపీఆర్ శిక్షణ సదస్సు నిర్వహించిన రాపిడో

Rapido conducted CPR training seminar for captains. భారతదేశంలోని ప్రముఖ బైక్-టాక్సీ, ఆటో సర్వీస్ అయిన రాపిడో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు

By Medi Samrat  Published on  7 Sept 2022 3:45 PM IST
కెప్టెన్‌ల‌కు సీపీఆర్ శిక్షణ సదస్సు నిర్వహించిన రాపిడో

భారతదేశంలోని ప్రముఖ బైక్-టాక్సీ, ఆటో సర్వీస్ అయిన రాపిడో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయాలనే దృఢనిశ్చయంతో ఉంది. దీని గురించి అవగా హన కల్పించేందుకు, ఈ విషయంలో తమ కెప్టెన్‌లకు నైపుణ్యం అందించేందుకు, కంపెనీ హైదరాబాద్‌లో ఉదయం 11 AM- 2 PM మధ్య సీపీఆర్ శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పి టల్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

మెడికల్ ఎమర్జెన్సీలు ఊహించనివి, కొన్ని సెకన్ల ఆలస్యాలు ప్రజల ప్రాణాలను బలిగొంటాయి. కార్డియో పల్మోనరీ రెసిసిటేషన్ (CPR) పై ప్రాథమిక జ్ఞానం చాలా మంది జీవితాలను రక్షించడంలో సమగ్ర పాత్ర పోషి స్తుంది. ఈ సెషన్‌ను నిర్వహించడం వెనుక బ్రాండ్ ప్రధాన లక్ష్యం గుండె ఆగిపోవడం వంటి ప్రాణాంతక వైద్య పరిస్థితులలో ప్రజలకు అవసరమైన సహాయం అందేలా చూడడమే. పరిస్థితికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా దాని కెప్టెన్‌లను మొదటి ప్రతిస్పందనదారులుగా ఉండేలా రాపిడో చేస్తుంది. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ వర్క్‌షాప్ కెప్టెన్‌లు, కాబోయే రైడర్‌లు, చుట్టుపక్కల వారికి భద్రతా భావాన్ని అందిస్తుంది.

ఇదే విషయమై రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక మాట్లాడుతూ, "మనం ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా లేదా రైడ్‌లో ఉన్నా, ఊహించని క్షణాల్లో ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయి. దురదృష్టవశాత్తూ, కార్డియాక్ అరెస్ట్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది సహాయం స్పాట్ వద్దకు వచ్చే లోపు చివరి శ్వాస విడుస్తారు. దీనికి ప్రధాన కారణం అవసరమైన సహాయాన్ని అందించడానికి సమీపం లో నైపుణ్యం కలిగిన సీపీఆర్ నిపుణులు లేకపోవడమే. ఈ సీపీఆర్ సెషన్‌తో, మెడికల్ ఎమర్జెన్సీ సమయం లో సకాలంలో సహాయం గురించి అవగాహన తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. దీనికి, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సరైన భాగస్వామి అవుతుందని మేం భావించాం. వారు అందించిన మద్దతుకు గాను వారికి మా కృతజ్ఞతలు. సకాలంలో చేసే సీపీఆర్ సెషన్‌తో ప్రాణాలను రక్షించడంలో రాపిడోలో మేం సహకరించ గలమని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

బ్రాండ్ కు సంబంధించి హైదరాబాద్ విస్తృత వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రముఖ మార్కెట్లలో ఒకటి. నగ రం లోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఆహ్లాదకరమైన వాతావరణంతో అత్యుత్తమ ఆధునిక హాస్పిటల్ డిజైన్, మెడికల్ టెక్నాలజీని మిళితం చేస్తుంది. రోగ నిర్ధారణ నుండి రీహాబిలిటేషన్ వరకు, వైద్యులు, సిబ్బంది అనుభవజ్ఞులైన నిపుణులు రోగులను మానవీయంగా చూసుకుంటారు.


Next Story