బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టిన రాజా సింగ్

సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.

By Medi Samrat  Published on  22 Oct 2023 5:27 PM IST
బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టిన రాజా సింగ్

సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం రాజాసింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ వచ్చారు. తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజాసింగ్ కు స్వాగతం పలికారు. రాజాసింగ్ ను కిషన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

2018 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాసింగ్ విజయం సాధించారు. బీజేపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. సస్పెన్షన్‌ ఉన్న నేపథ్యంలో ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొంత మేరకు ఉండింది. రాజాసింగ్ కూడా తాను బీజేపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని.. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతతో ఆయన బీజేపీ తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు.

Next Story