బీఆర్ఎస్ నేతపై ప్రశంసలు కురిపించిన రాజా సింగ్

Raja Singh praised Minister Talasani Srinivas Yadav. హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను

By Medi Samrat
Published on : 12 May 2023 3:59 PM IST

బీఆర్ఎస్ నేతపై ప్రశంసలు కురిపించిన రాజా సింగ్

హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరయ్యారు. ముగ్గురూ కలిసి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి తలసానిపై ప్రశంసలు కురిపించారు. తలసాని చాలా బాగా పని చేస్తున్నారని.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని అన్నారు.కొంత లేట్ అయినా ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని అన్నారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. మరికొందరు కూడా ఇళ్లు అడుగుతున్నారని.. వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఎప్పుడూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడే రాజా సింగ్ తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యంగా మారింది.


Next Story