ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలు ప్రాంతాలను భారీ వర్షం పలకరించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ద్రోణి ప్రభావం ఈశాన్య బంగాళాఖాతం వరకూ కొనసాగనుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.