హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్

హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది

By Medi Samrat  Published on  24 July 2024 10:45 AM GMT
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్

హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జూలై 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని బెజ్జూరు, చినమన్నేపల్లిలో 96 మిమీ, 81 మిమీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి సహా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Next Story