రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నాడు : రాగిడి లక్ష్మారెడ్డి

రేవంత్ రెడ్డి మోసం చేశాడని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

By Medi Samrat  Published on  15 Oct 2023 8:30 PM IST
రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నాడు : రాగిడి లక్ష్మారెడ్డి

రేవంత్ రెడ్డి మోసం చేశాడని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ త‌రుపున ఉప్ప‌ల్ టికెట్ ఆశించారు. కానీ ఈ రోజు ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల జాబితాలో త‌న పేరు లేదు. దీంతో ఆయ‌న మీడియా ముందు క‌న్నింటిప‌ర్యంత‌మయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఉప్పల్ లో ఓడించడానికి మాత్రమే ఇతరులకు టికెట్ కేటాయించారని అన్నారు. ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేశాన‌న్నారు. పార్టీకి ఎదురుతిరిగిన‌ వ్యక్తికి టికెట్ కేటాయించారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపిచేందుకు ఎంతో కష్టపడ్డానన్నారు. పీసీసీ అధ్యక్షుడైన‌ రేవంత్ రెడ్డిని ఎంతో గౌరవించానని.. కానీ అతను నియంతలా వ్యవహరిస్తున్నాడని వాపోయారు. చీకటి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని.. టికెట్ కోసం నన్ను కూడా డబ్బులు కావాలి అడిగాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సర్వే చేయకుండా ఇతరులకు టికెట్ కేటాయించారని ఆరోపించారు. ఇప్పటికైనా సర్వే చేసి టికెట్ కేటాయించాలన్నారు. 48 గంటల్లో రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంపై ఆలోచించాలి.. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. గతం లో 2 సార్లు టికెట్ ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్.. కానీ నేను పార్టీని వీడలేదు.. పార్టీ బోలేపేతానికి కృషి చేశానని పేర్కొన్నారు.

Next Story