రేపు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. స్టేడియంకు అవేవి తీసుకురావొద్ద‌ని సూచించిన సీపీ

రేపు జరగబోయే మ్యాచ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

By Medi Samrat  Published on  26 March 2024 6:29 PM IST
రేపు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. స్టేడియంకు అవేవి తీసుకురావొద్ద‌ని సూచించిన సీపీ

రేపు జరగబోయే మ్యాచ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం 39 వేల మంది ఒకేసారి క్రికెట్ ను వీక్షించే కెపాసిటీ ఉన్న స్టేడియమ‌ని తెలిపారు. రేపు జరగబోయే క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట.. లోపల బందోబస్తు ఉంటుందన్నారు. 2 వేల 5 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. అలాగే స్టేడియం లోపల, బయట మొత్తం 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేస్తామన్నామ‌ని తెలిపారు.

స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దని సూచించారు. కెమెరాలు, సిగరేట్స్, బైనాక్యులర్స్, హెల్మెట్స్, ఫుడ్ ని స్టేడియం లోపలికి అనుమతించమన్నారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి. ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉంటారు. గ్రౌండ్ లోపల వెండర్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ధరకు అమ్మకూడదని సూచించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామ‌ని వెల్ల‌డించారు. రేపు సాయంత్రం స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలుంటాయని.. వాహనదారులు వాటిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సీపీ సూచించారు.హెవీ వెహికిల్స్ ని అనుమతించమని.. 4 వేల కార్లు, 6 వేల బైక్స్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు.

Next Story