హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ సెంటర్‌లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్‌లో నిర్వహకులను, ఒక విటుడిని, పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా పేర్లతో కొందరు మసాజ్ సెంటర్ పేరు చెప్పి వ్యభిచారం నిర్వహిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
కొందరు వ్యక్తుల ద్వారా తమకు సమాచారం అందిందని, వెంటనే సోమవారం రాత్రి దాడులు జరిపామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని.. కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారకూపంలోకి దింపే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తున్నామన్నారు.