బ్రేకింగ్ : బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi arrived at Begumpet Airport. కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభకు హాజ‌ర‌య్యేందుకు హైద్రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న ప్రియాంక గాంధీ..

By Medi Samrat  Published on  8 May 2023 5:21 PM IST
బ్రేకింగ్ : బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi arrived at Begumpet Airport


కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభకు హాజ‌ర‌య్యేందుకు హైద్రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న ప్రియాంక గాంధీ.. కొద్దిసేప‌టి క్రితం బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాద‌వ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ప్రియాంక గాంధీ సరూర్ నగర్ గ్రౌండ్ కు వెళ్తారు.

సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే సరూర్ నగర్ హెలీప్యాడ్ ప్రాంతానికి చేరుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హెలీప్యాడ్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకోనున్నారు ప్రియాంక గాంధీ.


Next Story