నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi Visit to Hyderabad Today. ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు.

By Medi Samrat  Published on  8 April 2023 9:29 AM IST
నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi


ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. దాదాపు రెండు గంటల సేపు హైదరాబాద్‌లోనే ప్రధాని ఉంటుండటంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆయన బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లు స్వాగతం పలకనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి 12.15 గంటల మధ్య సికింద్రాబాద్ రైల్వే పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి బేగంపేట నుంచి బయలుదేరి వెళతారు.


Next Story