Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నేడే ప్రారంభం.. సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు ఇక్కడి నుంచే..

సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

By అంజి  Published on  6 Jan 2025 6:56 AM IST
Prime Minister Modi, Charlapally Railway Terminal, Hyderabad, SCR

Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నేడే ప్రారంభం.. సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు ఇక్కడి నుంచే..

హైదరాబాద్‌: సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌, సీఎం రేవంత్‌, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్‌ రెడ్డి ,బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు లు హాజరవుతారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్‌ను నిర్మించారు. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్‌ తీసుకుంటాయి.

సంక్రాంతికి వెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో 52 స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఆదివారం నాడు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వీటిని నడపనున్నట్టు వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో కొన్ని సోమవారం ప్రారంభం కానున్న చర్లపల్లి నూతన టర్మినల్‌ నుంచి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ - చెన్నై సెంట్రల్‌ నాంపల్లి టర్మినల్‌ నుంచి చర్లపల్లి టర్మినల్‌కు మారుస్తున్నట్టు ఎస్‌సీఆర్‌ ప్రకటించింది. అలాగే గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ - గోరఖపూర్‌ను ఎక్స్‌ప్రెస్‌ను కూడా సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చింది. ఈ నిర్ణయం మార్చి 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

Next Story