హెచ్‌ఐసీసీకి చేరుకున్న మోదీ
PM Modi reached HICC. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు.
By Medi Samrat Published on 2 July 2022 4:14 PM ISTప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి మోదీ హెచ్‌ఐసీసీకి బయలుదేరారు. కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాత్రికి నోవాటెల్‌లో ప్రధాని బస చేయనున్నారు.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022
ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపారు ప్రధాని మోదీ. డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామని ట్వీట్ చేశారు.