పవన్ కళ్యాణ్ 'వారాహి' రిజిస్ట్రేషన్ పూర్తి.. నెంబర్ ఎంతంటే..
Pawan Kalyan's 'Varahi' registration complete. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేశారు.
By Medi Samrat Published on
12 Dec 2022 9:59 AM GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనం రంగు.. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగు కావడంతో పలు విమర్శలు వచ్చాయి. వారాహి వాహనానికి క్లియరెన్స్ లభించింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని.. వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ TS 13 EX 8384 నెంబరు కేటాయించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. 'వారాహి'వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని.. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు కమిషనర్ పాపారావు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని..అన్ని నిబంధనలు ఉన్నాయని వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని అన్నారు.
Next Story