శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

హనోయ్‌కు వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి 12 గంటలకు పైగా చిక్కుకుపోయారు.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 3:02 PM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

హనోయ్‌కు వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి 12 గంటలకు పైగా చిక్కుకుపోయారు. ఆలస్యానికి సాంకేతిక లోపం కారణమని ఎయిర్‌లైన్ అధికారులు చెబుతున్నారు.

నివేదికల ప్రకారం.. విమానం మునుపటి రోజు రాత్రి 11:55 గంటలకు బయలుదేరాల్సి ఉంది. 193 మంది ప్రయాణికులు విమానం ఎక్కేందుకు వేచి ఉన్నారు. సరైన స్పందన లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు, ఎయిర్‌లైన్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. కోపోద్రిక్తులైన ప్రయాణీకులు సమస్యను త్వరగా పరిష్కరించాలని విమానాశ్రయ అధికారులను కోరుతున్నారు. "దయచేసి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి బాధ్యత వహించే వ్యక్తిని తీసుకురండి" అని ప్రయాణీకులలో ఒకరు అడుగుతున్నారు. "మొదట మీరు ఉదయం 9:00 గంటలకు, త‌ర్వా 10:30 గంటలకు పూర్తవుతుందని చెప్పారు.. మేము ఇక్కడ చిక్కుకుపోయాము" అని ఒక మహిళా ప్రయాణికురాలు అన‌డం చూడ‌వ‌చ్చు.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Next Story