హైదరాబాద్‌ యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్తానీ.. వెలుగులోకి అసలు నిజాలు.!

Pakistan man cheated a hyderabad woman. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌ దుబాయ్‌లో కచేరీలు చేస్తుంటాడు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో ఉండే ఓ యువతి విదేశాల్లో

By అంజి  Published on  30 Oct 2021 7:44 AM IST
హైదరాబాద్‌ యువతిని పెళ్లి చేసుకున్న పాకిస్తానీ.. వెలుగులోకి అసలు నిజాలు.!

పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌ దుబాయ్‌లో కచేరీలు చేస్తుంటాడు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో ఉండే ఓ యువతి విదేశాల్లో పాటలు పాడుతుంటుంది. ఈ క్రమంలోనే 9 సంవత్సరాల క్రితం వీరికి పరిచయం అయ్యింది. అబ్బాస్‌ తాను ఢిల్లీకి చెందిన ముస్లింగా యువతితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్‌ చేశాడు. దీనికి ఆమె అంగకీరించింది. ఇద్దరు హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. యువతి ఇస్లాం మతంలోకి మారిన తర్వాత చాదర్‌ఘాట్‌లో కాపురం పెట్టారు. పెళ్లి అయిన కొద్ది రోజులకు అత్తారింటికి వెళ్దామని భార్య అడగడంతో అసలు విషయం బయటపడింది. తాను పాకిస్తాన్‌కు చెందిన వాడినని, టూరిస్ట్‌ వీసాతో ఇక్కడి వచ్చానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అబ్బాస్‌ బెదిరించారు. అప్పట్నుంచి భర్తతో భయం భయంగానే కలిసి జీవిస్తోంది ఆమె. వారికి ఓ కుమార్తె ఉంది.

ఆరు సంవత్సరాల వయస్సున్న కుమార్తె పట్ల అబ్బాస్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీన్ని చూసి సహించలేక పోయిన భార్య 3 సంవత్సరాల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత అతడి ఇంట్లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో పోలీసులకు పాకిస్తాన్‌ పాస్‌పోర్టు దొరికింది. ఆధార్‌ కార్డు, సర్టిఫికేట్లు నకిలీవని గుర్తించారు. వెంటనే పాస్‌పోర్టును కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. పై అధికారులు అతడు పాకిస్తాన్‌ పౌరుడేనని ధ్రువీకరించారు. ఈ కేసుపై గత ఏడాది అక్టోబరులో నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది. తీర్పు వెల్లడిస్తూ.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నకిలీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ ఇచ్చిన వ్యక్తికి సైతం ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మహమ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌ చాదర్‌ఘాట్‌లోనే నివసించే నిజాం ఖాజా ద్వారా ఆధార్‌ కార్డును పొందాడు. ఆ తర్వాత వరంగల్‌లో ఉంటున్న అతడి స్నేహితుడి ద్వారా టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లు నకిలీవి సమకూర్చుకున్నాడు.

Next Story