హైదరాబాద్ పోలీసులు నలుగురు పాకిస్తాన్ జాతీయులకు ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. పహల్గామ్ ఊచకోత సంఘటన తర్వాత దేశంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులందరూ భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. నగరంలో 200 మందికి పైగా పాకిస్తాన్ జాతీయులు నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వం మంజూరు చేసిన దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్నారు.
స్వల్పకాలిక వీసాపై ఉన్న నలుగురు పాకిస్తాన్ జాతీయులను పోలీసులు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ జాతీయుల ఆచూకీని పోలీసులు వెల్లడించలేదు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థానీలను దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల సీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.