హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రేటు రూ.25 నుంచి రూ.30 పలకగా.. ప్రస్తుతం కిలో రూ.70కి చేరింది. ఈ పెరుగుదల వినియోగదారులలో ఆందోళనలను పెంచింది.
తెలంగాణ రైతు బజార్ల ధరల పట్టిక ప్రకారం.. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. అయితే.. స్థానిక దుకాణాలు(రిటైల్ వర్తకులు) కిలోకు రూ.70కి పైగా వసూలు చేస్తున్నాయి. దీంతో జనాలు ఉల్లి కొనాలంటే కన్నీరు పెడుతున్నారు..!
తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఉల్లి పంట గణనీయంగా దెబ్బతిన్నది. పంట నష్టం కారణంగా సరఫరా-డిమాండ్ అసమతుల్యతలు కూడా ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ఫలితంగా నగరంలో సరఫరా కొరత ఏర్పడింది. మలక్‌పేట్, బోవెన్‌పల్లి, మూసాపేట్, గుడిమల్కాపూర్‌తో సహా హైదరాబాద్‌లోని ప్రధాన ఉల్లి మార్కెట్‌లకు ఉల్లి రాక గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యింది.
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు ఉల్లి ధరలు పెరగడంతో వాడకం తగ్గించాయి. పలుచోట్లు ఉల్లిపాయలు లేవు అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఉల్లి ధరలు ఇంకా ఎంత వరకు పెరుగుతాయో అనే అనిశ్చితి నెలకొంది.