భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఒకటైన మా సరస్వతి ఆసుపత్రి హైదరాబాద్ నగరంలోకి రాబోతోంది. 5,100 అడుగుల విస్తీర్ణంలో ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అనేక రోగనిర్ధారణ సౌకర్యాలు ఉండులో ఉన్నాయి. అలాగే ప్రత్యేక వైద్యులు, సర్జన్లు, పారామెడికల్ సిబ్బందితో కూడిన మెడికల్ డిస్పెన్సరీతో ఈ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. గగన్‌పహాడ్‌లోని సత్యం శివం సుందరం గౌ శాల వద్ద ఇది రాబోతోంది. ఆధునిక డయాగ్నోస్టిక్స్, ఎక్స్-రే యంత్రం, ఎండోస్కోప్, బ్లడ్-ఇన్సులిన్ ఎనలైజర్, ఇతర సౌకర్యాలతో పాటు అంబులెన్స్ సదుపాయం కూడా ఈ ఆసుపత్రిలో ఉంటుంది.
గగన్‌పహాడ్‌లోని సత్యం శివం సుందరం గోశాలలో 3,200 ఆవులకు, బురుజుగడ్డ వద్ద 2,800 ఆవులకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాలగా చెబుతున్నారు. జూలై మొదటి వారంలో ఆసుపత్రి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రి గత 30 సంవత్సరాలుగా ఆవులను రక్షించే లక్ష్యంతో ఉన్న నగరంలోని రిటైర్డ్ స్వర్ణకారుడు 85 ఏళ్ల ధరమ్ రాజ్ రంకా చిరకాల స్వప్నమని తెలుస్తోంది. అత్యాధునిక పశువైద్యశాలలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి జంతువులకు కూడా సేవలను అందిస్తుంది.