విదేశాల నుంచి యదేచ్చగా గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద తనీఖీలు చేపట్టగా ఇద్దరు ప్రయాణీకులు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
ఈ రోజు తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.52.24 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇతను బంగారాన్ని ముద్ద రూపంలో తీసుకువచ్చాడు. అలాగే 3.45 గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఇతడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తీసుకువచ్చాడు.
ఇద్దరి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.