Alert : రేపు న‌గ‌రంలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది.

By Medi Samrat  Published on  23 Oct 2024 8:00 PM IST
Alert : రేపు న‌గ‌రంలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది.

నీటి సరఫరా బంద్ అయ్యే ప్రాంతాల్లో శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, అల్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటో నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్ పురి, మౌలాలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, స్నేహగిరి, స్నేహగిరి. , దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, కిస్మత్పూర్, గంధం గూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, ధర్మసాయి (శంషాబాద్) ఉన్నాయి.

హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో 2375 ఎంఎం డయామ్స్ పంపింగ్ మెయిన్‌లో లీకేజీ ఏర్పడిందని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టాలని.. ఈ 24 గంటల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించాలని జలమండలి కోరింది.

Next Story