హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అక్కడికి నీళ్లు బంద్

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కొన్ని ప్రాంతాలకు శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 6 March 2026 9:40 AM IST

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అక్కడికి నీళ్లు బంద్

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కొన్ని ప్రాంతాలకు శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు. మంజీరా ఫేజ్–-3, పెద్దాపూర్ పంప్ హౌస్ లో 35 సంవత్సరాలకు పైబడిన హై టెన్షన్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్​ను తొలగించి, కొత్త ప్యానెల్స్‌‌ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్‌‌లైన్‌‌లోని ఎయిర్ వాల్వ్‌‌లను, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్‌‌లైన్‌‌లోని ఎయిర్ వెంట్స్‌‌ను మారుస్తున్నట్టు చెప్పారు. 7న శనివారం ఉద‌‌యం 8 గంట‌‌ల‌‌ నుంచి 8వ తేదీ ఆదివారం రాత్రి 8 గంట‌‌ల వ‌‌ర‌‌కు ఈ పనులు కొనసాగుతాయన్నారు అధికారులు. దీంతో శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. షేక్‌‌పేట్ పరిధిలోని మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెషర్​తో నీళ్లు వస్తాయని అధికారులు చెప్పారు.

Next Story