హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు తాగునీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) ప్రకటించింది. బోరబండ నుంచి లింగంపల్లికి అనుసంధానం చేసే సఫ్దర్‌గర్ వద్ద నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఎస్పీఆర్ హిల్స్, జయవంతనగర్, సునీల్‌నగర్ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోతుందని వెల్లడించింది. బోరబండ, మహాత్మానగర్, వినాయకనగర్, హబీబ్ ఫాతిమానగర్ (ఫేజ్ 1 మరియు 2), ఇంద్రనగర్, టి అంజయ్య నగర్, బాబా సైలానీనగర్, భరత్‌నగర్, పాత అల్లాపూర్, కొత్త అల్లాపూర్, సెంట్రల్ అల్లాపూర్, శివబస్తీ, అజీజ్‌నగర్, మీరాజ్‌నగర్, పద్మావతినగర్, గాయత్రీనగర్, తులసీనగర్, వివేకానందనగర్, పర్వత నగర్‌లలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మోతీనగర్‌లోని రామారావునగర్, హరినగర్, శివాజీనగర్, ఆర్కే సొసైటీ, రాధాకృష్ణనగర్, కేఎస్ నగర్, రాణాప్రతాప్‌నగర్, గణేష్‌నగర్‌తో సహా హైదరాబాద్ బోర్డు నిర్దేశించిన వ్యవధిలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించింది.