హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ ఆఫీస్.. నేడే ఆరంభం..!

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

By -  Medi Samrat
Published on : 12 March 2026 3:00 PM IST

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ ఆఫీస్.. నేడే ఆరంభం..!

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నెల్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షాపిరో హాజరయ్యారు. అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ముంబై తర్వాత ఇది రెండో ఆఫీసు. హైటెక్ సిటీలో క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్‌‌‌‌‌‌‌‌ ఏలో 40వేల చదరపు అడుగుల ఈ ఆఫీస్ ఏర్పాటు చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనన్నారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు.


Next Story