హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ప‌ట్టివేత‌

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ బ్యూరో

By Medi Samrat  Published on  18 Dec 2023 7:45 PM IST
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ప‌ట్టివేత‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ బ్యూరో. పుట్టిన రోజు పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకువచ్చారు యువకులు. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థి లతో పాటు సాఫ్టువేర్ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యారని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు సంపత్. 30 మంది కోసం డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు ప్రేమ్ చంద్.

నార్కటిక్ బ్యూరో అధికారులకు ఎస్సార్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం రావడంతో వెంటనే ఆ అపార్ట్మెంట్ పై దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒక రాజకీయ నాయకుడు కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ్ బర్త్డే పార్టీ ఆ అపార్ట్మెంట్లో జరుపుకుంటున్నారు. ఈ పార్టీలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ప్రముఖ ఫేమస్ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పక్క సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేసి వారందరిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story