మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌.. హైద్రాబాద్‌లో 'మోదీ నో ఎంట్రీ' ఫ్లెక్సీ

‘Modi No Entry’ flex appears in Hyderabad. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు గురువారం నగరంలో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ విభాగం

By Medi Samrat  Published on  10 Nov 2022 1:04 PM IST
మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌.. హైద్రాబాద్‌లో మోదీ నో ఎంట్రీ ఫ్లెక్సీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు గురువారం నగరంలో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో 'మోదీ నో ఎంట్రీ' ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లెక్స్‌లో.. చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోవాల‌ని కోరారు. గతంలో చేనేత ఉత్పత్తులు, ముడిసరుకులపై విధించిన ఐదు శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ చేనేత కార్మికులు రాసిన లక్షలాది పోస్టుకార్డులను ప్రధానికి పంపారు. అక్టోబర్ 22న మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పోస్ట్‌కార్డులు పంపించారు.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ శనివారం రామగుండం సందర్శించనున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. తెలంగాణలోకి ప్రవేశించే ముందు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ "మోడీ గో బ్యాక్" నిరసనలు ఊపందుకుంటున్నాయి.


Next Story