నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కేటీఆర్ సంద‌డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ కు వెళ్లి సందడి చేశారు.

By Medi Samrat  Published on  14 Nov 2023 2:37 PM GMT
నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కేటీఆర్ సంద‌డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ కు వెళ్లి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. మంత్రి కేటీఆర్ నీలోఫర్ కేఫ్ కు వెళ్లడంతో అక్కడ ఉన్న జనాలందరూ ఆయ‌న‌ను చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కేటీఆర్ రాక‌తో అక్క‌డున్న వారు ఆయ‌న‌తో కలిసి కాఫీ తాగడమే కూకుండా.. సెల్ఫీలు కూడా దిగారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్.. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో కలిసి ముచ్చటించారు. మొన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.


Next Story