ఎవ్వరూ ఆందోళన చెందవద్దు.. ప్రశాంతంగా నిమజ్జనం ఘట్టాన్ని పూర్తి చేస్తాం : మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
By Medi Samrat Published on 27 Sept 2023 6:00 PM ISTఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శోభా యాత్ర సాగే రూట్ లను మరోసారి పరిశీలించామని తెలిపారు. చట్టానికి లోబడి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరుగుతుంది. మీడియాలో అసత్యపు వార్తలు వేయవద్దని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ ఏటిన నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమజ్జనాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు.
భాగ్య నగర్ గణేష్ ఉత్సవాలు కమిటీ పూర్తి సహకారం అందుస్తుందని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జన శోభ యాత్ర జరిగే చోటా త్రాగు నీరు వసతి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ 11 రోజుల ఉత్సవాల దగ్గర నుంచి నిమజ్జనం వరకు కమిటీ సభ్యులే భరించే వారు.. నిమజ్జనానికి గతంలో వారే ఖర్చు పెట్టి క్రేన్లు తెప్పించే వారు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఅర్ నిర్ణయం మేరకు ప్రభుత్వమే అన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చట్టానికి లోబడి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
నగర వ్యాప్తంగా విగ్రహల నిమజ్జనం కోసం ప్రత్యేక బేబీ పాండ్స్, చెరువుల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు.. ప్రశాంతంగా నిమజ్జనం ఘట్టాని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం రేపు 1 .30 గంటలకి పూర్తి అవుతుందని తెలిపారు.
మీడియా సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇవిడి ఏం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.