ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

Minister KTR to lay foundation stone for Genpact campus in Uppal. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో విస్తరిస్తుండటంతో ఐటీ రంగంలో

By Medi Samrat  Published on  13 Feb 2022 4:17 AM GMT
ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో విస్తరిస్తుండటంతో ఐటీ రంగంలో న‌గ‌రం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీలకే పరిమితమైన ఐటీ కంపెనీలు ఇప్పుడు నగరమంతటా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నగరానికి నలుమూలలా ఐటీ కంపెనీలను విస్తరించడంపై దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ జెన్ ప్యాక్ట్ ఉప్పల్ లో గ్రిడ్ పాలసీలో భాగంగా క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తూర్పు హైదరాబాద్ లో మరో భారీ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఇందులో భాగంగా ఆదివారం (నేడు) క్యాంపస్ నిర్మాణానికి ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ట్విటర్‌లో.. గ్రిడ్ విధానంలో భాగంగా ఉప్పల్‌లో 'జెన్‌పాక్ట్' క్యాంపస్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలో నేడు ఉప్పల్ క్యాంపస్‌లో భూమి పూజ నిర్వహించి 15 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించనున్నారు. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల కల్పనకు చేరుకుంటాం'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Next Story