ప్రాణ‌వాయువు కొరతను తీర్చే పనిలో ఎంఈఐఎల్‌.. థాయ్‌లాండ్ నుండి ఆక్సిజ‌న్ టాంకర్ల దిగుమతి

MEIL imports Oxygen Tankers From Thailand To Fight Shortage in India. కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్న భారత్ ను ఆదుకోడానికి మేఘా ఇంజనీరింగ్

By Medi Samrat  Published on  22 May 2021 7:03 AM GMT
ప్రాణ‌వాయువు కొరతను తీర్చే పనిలో ఎంఈఐఎల్‌.. థాయ్‌లాండ్ నుండి ఆక్సిజ‌న్ టాంకర్ల దిగుమతి

కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్న భారత్ ను ఆదుకోడానికి మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..! భారత్ లో ఆక్సిజన్ అవసరాలకు తగ్గట్టుగా పలు ఏర్పాట్లను చేస్తూ ఉంది ఎంఈఐఎల్‌ సంస్థ. సామాజిక సేవలో ముందున్న ఎంఈఐఎల్‌ సంస్థ థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. 11 టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసుకోనుండగా.. తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకులు రానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. వీటిని ప్రభుత్వానికి ఉచితంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇవ్వనుంది. వీటి ద్వారా ఆక్సిజన్ కష్టాలను తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఇంతకు ముందే ఉచితంగా ఆక్సిజన్ సరఫరాకు ముందుకు వచ్చింది. హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రులకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో చెప్పారు. వారు చెప్పినట్లుగానే సహాయం చేయడానికి ఎంఈఐఎల్ ముందుకు వచ్చింది. భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. డి.ఆర్.డి.వో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. అంతేకాకుండా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల తయారీకి కూడా ఎంఈఐఎల్ సంస్థ సిద్ధమైంది.


Next Story